close

తాజా వార్తలు

అర్ధరాత్రి నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ సేవలు బంద్‌

ఆర్థిక సంక్షోభం వల్లే

దిల్లీ: అప్పుల ఊబిలో కొట్టు మిట్లాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. అసలే రుణబాధలు అపై నిధుల కొరతతో బాధ పడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ రాత్రి నుంచి తమ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇన్ని రోజులు కార్యకలాపాలు ఆగిపోకుండా కాపాడుకుంటూ వచ్చినా ఆ సంస్థకు కావాల్సిన రుణాలు అందక పోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జెట్‌ విమానాలు నడవాలంటే కనీసం రూ.400 కోట్లు కావల్సి ఉంది. ఆ డబ్బు ఇవ్వడానికి ఇటు రుణదాతలు కానీ, అటు బ్యాంకులు కానీ ముందుకు రాలేదు. దీంతో తప్పని సరి పరిస్థితిల్లో సేవలను ఆపేసింది.అయితే పూర్తిస్థాయి విమాన సర్వీసుల రద్దుపై ఈ సంస్థ స్పష్టతనివ్వలేదు. ఈ రోజు రాత్రి 10:30గంటలకు నడిచే విమానమే చివరిదని ప్రకటించింది.

నిధుల విషయమై సోమవారం నుంచి బ్యాంకర్లు, జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రతినిధుల మధ్య సుదీర్ఘ సమావేశాలు జరిగాయి. జెట్ సంస్థ సేవలు నిలిచిపోకుండా కొనసాగేందుకు రూ. 400 కోట్లు అత్యవసర రుణం కావాలని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. అయితే అప్పటి వరకు జెట్‌ యాజమాన్యాన్ని ఊరించిన రుణ దాతలు, బ్యాంకులు చివరి నిమిషంలో చేతులెత్తేశారు. 

రుణ సంక్షోభం కారణంగా జెట్‌ ఇప్పటికే చాలా విమానాలు నిలిపివేసింది. ఒకప్పుడు 123 విమానాలతో దిగ్విజయంగా సేవలందించగా ప్రస్తుతం కేవలం 5 విమానాలతోనే సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. డబ్బులు ఇస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని అటు ఇంధన సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో అత్యవసర నిధుల కోసం రుణదాతలను కోరినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.మరోవైపు సిబ్బందికి వేతనాలు ఇవ్వడంలోనూ జెట్‌ విఫలమైంది. దీంతో ఆ సంస్థ సిబ్బంది ఇటు పౌర విమానయాన శాఖమంత్రి సురేశ్‌ ప్రభుకు, ఇటు ప్రధాని నరేంద్ర మోదీకి తమ గోడు చెప్పుకున్నారు. 

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.