
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: దేశంలోని నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు తీవ్రమైన నగదు సమస్యను ఎదుర్కొంటున్నాయి. వచ్చే త్రైమాసికంలోపు ఈ కంపెనీలు చెల్లించాల్సిన స్థానిక కరెన్సీ బాండ్ల విలువ రూ.1.1లక్షల కోట్లకు సమానం. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. ఇప్పుడు చెల్లింపుల కోసం ఈ సంస్థలకు రీఫైనాన్సింగ్ కూడా లభించే పరిస్థితి లేదు. ఇది మరింత సమస్యలను పెంచే అవకాశం ఉంది. 2020లో మొదటి రెండు త్రైమాసికాల్లో రూ.లక్ష కోట్లు చొప్పున ఎన్బీఎఫ్సీలు చెల్లించాల్సి ఉంది. ఇక ఏడాది మొత్తం మీదా రూ.3.9లక్షల కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది.
ఇప్పుడు చెల్లించాల్సిన మొత్తాలు కొండలా పెరిగిపోతుండటంతో కంపెనీలు నిధుల కోసం ఎన్బీఎఫ్సీలు బ్యాంకులు, ఇతర రుణదాతలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రుణాలను విక్రయించేసి ఆ మొత్తాలతో చెల్లింపులు చేసే అవకాశం మాత్రమే ఉంది. ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సమస్య ఎదురైతే దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా అది ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, ఇతర చిరు వ్యాపారులపై ఈ ప్రభావం పడుతుంది. ఈ రంగాలకు బ్యాంకుల నుంచి తేలిగ్గా రుణాలు అందే పరిస్థితి ఉండదు. దీంతో ఎన్బీఎఫ్సీలే బ్యాంకులకు బాండ్లను జారీ చేసి నగదు సేకరించి ఈ రంగాలకు ఫైనాన్స్ చేస్తుంది. దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కూడా పీకల్లోతు కష్టాల్లో ఉంది.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
