Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 67016
            [news_title_telugu_html] => 

ప్రపంచబ్యాంకు మెచ్చిన మనసేవా

[news_title_telugu] => ప్రపంచబ్యాంకు మెచ్చిన మనసేవా [news_title_english] => [news_short_description] => ధ్రువపత్రాల కోసం గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులు... రవాణా సౌకర్యం లేక వారు ఎదుర్కొంటున్న ఇక్కట్లు... ఆమెను ‘మన సేవా’ కేంద్రం ఏర్పాటు చేసేలా చేశాయి. దీంతో అక్కడి ప్రజల వెతలు తీరాయి. ఆమెకూ ఓ ఉపాధి మార్గం దొరికింది. ఆమే కొల్లి రమణమ్మ... [news_tags_keywords] => Mana seva, Mahila jayaho, Gramikya sangham, Inspiring story. [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-03-13 04:14:45 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రపంచబ్యాంకు మెచ్చిన మనసేవా - EENADU
close

తాజా వార్తలు

ప్రపంచబ్యాంకు మెచ్చిన మనసేవా

ధ్రువపత్రాల కోసం గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులు... రవాణా సౌకర్యం లేక వారు ఎదుర్కొంటున్న ఇక్కట్లు... ఆమెను ‘మన సేవా’ కేంద్రం ఏర్పాటు చేసేలా చేశాయి. దీంతో అక్కడి ప్రజల వెతలు తీరాయి. ఆమెకూ ఓ ఉపాధి మార్గం దొరికింది. ఆమే కొల్లి రమణమ్మ. ప్రపంచబ్యాంకు ఈ కేంద్రం సేవలు గుర్తించి ప్రశంసించడం విశేషం.

కొల్లి రమణమ్మ స్వస్థలం విజయనగరం జిల్లాలోని పాచిపెంట మండలం మోసూరు. పెళ్లైన తరువాత పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. అప్పట్లో గ్రామస్థులు, రైతులు మీసేవా కేంద్రం సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. మోసూరు చుట్టు పక్కల ఉండే జింకాడి  వలస, సురగడివలస, పనకవలస, జీలుగువలస ప్రజలంతా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోసూరు వరకూ వచ్చి అక్కడి నుంచి కనీసం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేవారు. సరైన రవాణా లేక   అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇవన్నీ గుర్తించిన రమణమ్మ గ్రామైక్య సంఘం ద్వారా రూ.1.50 లక్షల అప్పు తీసుకుంది. ఈ డబ్బుతో ఇంటివద్ద మన సేవా కేంద్రం ఏర్పాటు చేసింది. దీంతో గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల సమస్యలు తీరాయి. ఈ కేంద్రాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించి ఆమె సేవలను భేష్‌ అంటూ మెచ్చుకున్నారు. అంతేకాకుండా వారు విడుదల చేసిన సంచికలో ఈ కేంద్రం, ఆమె సేవల గురించి ప్రచురించారు.
ఆరింటిలో ఒకటి...
ఇతర పాంతాల్లోని ‘మన సేవా’ కేంద్రాల కంటే గిరిజన ప్రాంతంలో ఉత్తమంగా సేవలందిస్తోందీ కేంద్రం. దీని  ఏర్పాటుతో మొత్తం రెవెన్యూ, పోలీసు, బ్యాంకింగ్‌ ఇలా 40 రకాల సేవలు గిరిజనులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మన సేవా కేంద్రాలను పరిశీలించి అందులో ఆరింటిని ఎంపిక చేశారు. ఇదే కాకుండా రమణమ్మ కుట్టుమిషన్‌ కూడా కుట్టి... కొంత ఆదాయం సంపాదిస్తున్నారు.

-గ్రంది వెంకటరాజు,  న్యూస్‌టుడే పాచిపెంట


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.