close

తాజా వార్తలు

ఒత్తిడిని చిత్తు చేద్దాం

మారిన పరిస్థితుల్లో ఒత్తిడి సహజం. కానీ నిత్యం ఇలాగే గడపడం వల్ల ఉద్యోగంపై ప్రభావం పడుతుంది. ఏకాగ్రత కుదరక పనిచేయలేని పరిస్థితి ఎదురవుతుంది. అందుకే ఆ ఒత్తిడిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.
* దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలడం వల్ల ఒత్తిడిని పెంచే హార్మోన్ల విడుదల తగ్గుతుంది. గట్టిగా ఊపిరిపీల్చుకుని కాసేపయ్యాక నోటితో నెమ్మదిగా వదలాలి. కొన్ని సెకన్ల పాటు ఇలా చేయడం వల్ల యథావిధిగా మళ్లీ మీ పని మీదకు ధ్యాస మళ్లించగలుగుతారు.
* నిరంతరం ఏదో ఒకటి ఆలోచించడం వల్ల ఆందోళన, నిరాశ తప్పదు. ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపిస్తే...ఒక్కసారి మీ బలాలు గుర్తు తెచ్చుకోండి. ఒత్తిడిలో కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాల గురించి ఆలోచించండి. అప్పుడు మీరు కోరుకున్నది సాధ్యం.
* రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోకపోయినా కూడా ఆ ప్రభావం పనిపై పడుతుంది. అది కూడా పరోక్షంగా ఒత్తిడికి కారణమే. కాబట్టి దినచర్యను ఓ ప్రణాళిక ప్రకారం రూపొందించుకోవాలి. కనీసం ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు ఎలక్ట్రానిక్‌ వస్తువులకు దూరంగా ఉండాలి. లావెండర్‌ నూనెను కొద్దిగా తలకు రాసుకోవడం వల్ల కూడా హాయిగా నిద్రపడుతుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.