
తాజా వార్తలు
దిల్లీ: ప్రధాని మోదీ సోదరుడి కుమార్తె దమయంతి బెన్ మోదీ వ్యాలెట్ దొంగలించిన వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని నోనుగా గుర్తించారు. దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గుర్తు తెలియని ఇద్దరు ముసుగు దొంగలు ద్విచక్రవాహనంపై వచ్చి తన వ్యాలెట్ లాక్కెళ్లిపోయారని దమయంతి బెన్ మోదీ శనివారం సివిల్ లైన్స్‌లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంఘటన స్థలిలో సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు బృందాలుగా ఏర్పాడి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది.
ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. శనివారం ఉదయం దమయంతి బెన్ మోదీ అమృత్సర్ నుంచి దిల్లీకి వచ్చారు. బస కోసం సివిల్ లైన్స్ ప్రాంతంలోని గుజరాతీ సమాజ్ భవన్లో గది బుక్ చేసుకున్నారు. గేటు వద్దకు వచ్చేసరికి ఇద్దరు ముసుగు దొంగలు బైక్‌పై వచ్చి ఆమె చేతిలోని వ్యాలెట్‌ను లాక్కెళ్లారు. అందులో రూ.56 వేల నగదు, రెండు సెల్ ఫోన్లు, ముఖ్యమైన పత్రాలు ఉన్నాయని దమయంతి మోదీ వివరించారు. శనివారం సాయంత్రం విమానం ఎక్కాల్సి ఉందని, కానీ ముఖ్యమైన పత్రాలన్నీ ఆ సంచిలోనే ఉండిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- చైనా సూర్యుడు
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
- హైదరాబాద్‌లో విద్యార్థుల ఆందోళన
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
