close

తాజా వార్తలు

రోడ్డురోలర్‌లో పెళ్లి బాజా

వెరైటీ

పెళ్లంటే పల్లకిలో ఊరేగుతారు. ఖరీదైన కారు.. లేదంటే వింటేజ్‌ కారు కోరుకుంటారు. కానీ ఓ కొత్త పెళ్లికొడుకు వెరైటీగా రోడ్డురోలర్‌లో మంటపానికి ఊరేగింపుగా వచ్చాడు. బారాత్‌ కూడా దాంట్లోనే జోష్‌తో జరుపుకున్నాడు. కోల్‌కతాలోని కృష్ణానగర్‌లో ఈ చిత్రమైన పెళ్లి జరిగింది. పెళ్లి కొడుకు ఆర్కోకి ఎప్పటికైనా రోడ్డురోలర్‌పైకి ఎక్కి ఊరేగాలన్నది చిన్ననాటి కోరిక. దానికి పెళ్లికి మించిన మంచి రోజు ఏముంటుందని భావించాడు. అతడి కోరిక పెద్దలకు  విచిత్రంగా అనిపించినా కాదనలేకపోయారు. పెళ్లికొడుకే కాదు పెళ్లికూతురు అరుంధతి సైతం ఈ వేడుకలో ఊరేగింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.