close

తాజా వార్తలు

వర్మ ట్రైలర్‌ విడుదలకు సూర్య

వర్మ ట్రైలర్‌ విడుదలకు సూర్య

కోడంబాక్కం, న్యూస్‌టుడే: తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుని ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. విజయ్‌ దేవరకొండ నటించిన ఈ సినిమా ప్రస్తుతం తమిళంలో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. విక్రం కుమారుడు ధ్రువ్‌ ఇందులో హీరోగా నటిస్తున్నారు. బాలా దర్శకత్వం వహిస్తున్నారు. మేఘచౌదరి కథానాయిక. ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇటీవల టీజర్‌ను కూడా విడుదల చేశారు. బాలా అభిమానులకు ఇదో కొత్త ట్రీట్‌లా అనిపించింది. ఇదిలా ఉండగా సినిమా ట్రైలర్‌ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను ఈనెల 9వ తేదీన నటుడు సూర్య విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. బాలా చిత్రాలతో విక్రం, సూర్యలు ఎనలేని స్టార్‌డం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందుకేనేమో ఇప్పుడు విక్రం కుమారుడి సినిమా ట్రైలర్‌ను సూర్య ఆవిష్కరిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.