close

తాజా వార్తలు

మళ్లీ ఆ హీరో గడప తొక్కని శంకర్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక సినిమా రిచ్‌గా, బాక్సాఫీస్‌ వద్ద భారీగా ఉందంటే అది కచ్చితంగా శంకర్‌ సినిమానే. తమిళ దర్శకుడే అయినా, ఆయన తీసిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకులనీ అలరించింది. ‘జెంటిల్‌మేన్‌’ నుంచి ‘ఐ’ వరకూ ప్రతి సినిమా ఇక్కడి వారికి సుపరిచితమే. ఇప్పుడంటే శంకర్‌ స్టార్‌ డైరెక్టర్‌ కానీ, ఒకప్పుడు అవకాశాల కోసం ఆయన తిరగని ఆఫీస్‌ లేదు. అసలు శంకర్‌ నటుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చారట. శంకర్‌ వేసిన ఓ నాటకం చూసి, కథానాయకుడు విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఆయనకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా అవకాశం ఇచ్చారు. అలా శంకర్‌కు నెమ్మదిగా దర్శకత్వంపై ఆసక్తి పెరిగింది.

‘జెంటిల్‌మేన్‌’ కథ సిద్ధం చేసుకున్న తర్వాత శంకర్‌ ఓ పెద్ద హీరో దగ్గరకు వెళ్లాడు. ‘రెండున్నర గంటలు కథ వినాలా? అంత సమయం లేదు. ఓ గంటా గంటన్నరలో చెప్పేసెయ్‌’ అని ఆ హీరో అనడంతో సర్లే అని మరసటి రోజు కథ చెబుదామని వెళ్లాడు. ‘గంటన్నర కష్టం బాబూ. అరగంటలో అయితే చెప్పు’ అని ఆ హీరో అనడంతో మళ్లీ ఆ హీరో దగ్గరకు వెళ్లలేదు శంకర్‌. 
ఆ తర్వాత ఆ కథను హీరో అర్జున్‌కు వినిపించేందుకు ఆయన ఇంటి చుట్టూ దాదాపు పదిసార్లు తిరిగారు. ఆ సమయంలో వరుస ఫ్లాప్‌లతో సతమతవుతున్న అర్జున్‌ తీవ్ర నిరాశలో ఉన్నారు. చివరకు ఒక రోజు అర్జున్‌ను కలిసిన శంకర్‌ ‘సర్‌ మీరు ఈ సినిమా చెయ్యొదు. కానీ, ఒకసారి నా సినిమా కథ వినండి’ అనడంతో ‘జెంటిల్‌మేన్‌’ కథను రెండున్నర గంటల పాటు అర్జున్‌కు వినిపించారు. అప్పట్లోనే రూ.కోటితో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అటు శంకర్‌ కెరీర్‌కు భారీ పునాది పడటమే కాదు.. అర్జున్‌ సినీ కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్‌ సినిమాగా నిలిచింది. ఇటీవలే శంకర్‌ తన సినీ కెరీర్‌లో పాతికేళ్లు పూర్తి చేసుకున్నారు. కాగా, ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘2.ఓ’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.