close

తాజా వార్తలు

‘రెడీ రెడీ’ అంటున్న మిల్కీ బ్యూటీ..!

హైదరాబాద్: మిల్కీ బ్యూటీ తమన్నా, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అభినేత్రి 2’. ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘రెడీ రెడీ’ అనే పాట మంగళవారం విడుదలైంది. పాటలో తమన్నా చిందులేస్తూ.. ప్రభుదేవాను ఆటపట్టిస్తూ కనిపించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 2016లో వచ్చిన ‘అభినేత్రి’కి సీక్వెల్‌ ఇది. ఈ సారి సినిమాలో ప్రభుదేవాను రెండు దెయ్యాలు పీడించబోతున్నాయి. నందితా శ్వేత, కోవై సరళ, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను మే 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ‘దేవి 2’ టైటిల్‌తో విడుదల చేయనున్నారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.