
తాజా వార్తలు
‘పెళ్లి విఫలమైనప్పుడు తట్టుకోలేకపోయా’
హైదరాబాద్: దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌తో తన వివాహ బంధం విఫలమైన తర్వాత ఎక్కడికైనా పారిపోవాలనిపించిందని కథానాయిక అమలాపాల్ అన్నారు. 2014లో విజయ్, అమలాపాల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల 2016లో విడిపోయారు. 2017లో విడాకులు మంజూరయ్యాయి. అయితే విజయ్‌తో బంధానికి స్వస్తి పలికిన తర్వాత తన మానసిక పరిస్థితి గురించి అమలాపాల్ ఓ ఆంగ్లమీడియాతో మాట్లాడారు. చాలా బాధపడ్డానని తెలిపారు.
‘చిత్ర పరిశ్రమకు వచ్చినప్పుడు నా వయసు 17 ఏళ్లు. ఆ సమయంలో నాకు ఏమీ తెలియదు. నా పెళ్లి విఫలమైనప్పుడు దాన్ని తట్టుకోలేకపోయాను. ఒంటరిదాన్ని అయిపోయా అనిపించింది. ఎక్కడికైనా పారిపోవాలి అనిపించింది. ఆ సమయంలో చాలా బాధపడ్డా. 2016లో హిమాలయాలకు వెళ్లా. అక్కడ జీవితం పరమార్థం తెలుసుకున్నా. నాలుగు రోజులపాటు మొబైల్ ఫోన్ లేకుండా గడిపా, టెంట్లో నిద్రపోయా. ఆ ట్రిప్ తర్వాత నాలో అసంతృప్తి చెందే ధోరణి తగ్గిపోయింది’.
‘ఇప్పుడు పాండిచ్చేరిలో సింపుల్‌గా జీవిస్తున్నా. నెలకు రూ.20 వేలు మాత్రమే ఖర్చు పెడుతున్నా. నా మెర్సిడెస్ కారు కూడా అమ్మేశా. ఇంటికి కావాల్సిన వస్తువులు కొనడానికి సైకిల్‌పై వెళ్తున్నా. నాకు హిమాలయాల్లో జీవించాలని ఉంది. కానీ అది కష్టం, అందుకే పాండిచ్చేరిని ఎంచుకున్నా. బ్యూటీపార్లర్‌కు వెళ్లడం కూడా ఆపేశా. ముఖానికి కేవలం ముల్తానీ మట్టి, పెసలు పేస్ట్ మాత్రం రాస్తున్నా’ అని ఆమె అన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- విచారణ ‘దిశ’గా...
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- కొడితే.. సిరీస్ పడాలి
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
