close

తాజా వార్తలు

‘బిగ్‌బాస్‌’ వ్యవహారంలో ముందస్తు బెయిలు

జూబ్లీహిల్స్‌: బిగ్‌బాస్‌ కార్యక్రమంపై పాత్రికేయురాలు శ్వేతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో బంజారాహిల్స్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో కార్యక్రమ ఇన్‌ఛార్జి శ్యాంతో పాటు మరో ముగ్గురికి ముందస్తు బెయిలు లభించింది. ఈ నెల 13న శ్వేతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్యక్రమ నిర్వాహకుడు శ్యాంతో పాటు రవికాంత్‌, రఘు, శశికాంత్‌లపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న వారు బుధవారం నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిలు పొందారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు స్టార్‌మా అడ్మిన్‌ హెడ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.