
తాజా వార్తలు
వీడియో షేర్ చేసిన నటుడు
హైదరాబాద్: చిత్ర పరిశ్రమలో రాణించాలంటే మంచి ఫిజిక్ తప్పనిసరి. హీరో, హీరోయిన్, సహాయ నటులు అనే తేడా లేకుండా అందరూ జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తుంటారు. చాలా మంది సెలబ్రిటీలు జిమ్ వీడియోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను ప్రోత్సహిస్తుంటారు. తాజాగా నటుడు ప్రియదర్శి వ్యాయామశాలలో కసరత్తులు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. జిమ్ ట్రైనర్ ఆంటోనీ తనను శిక్షించినట్లు పేర్కొన్నారు. ‘పది రోజులు జిమ్ ఎగ్గొట్టినందుకు జిమ్ ట్రైనర్ నన్ను ఇలా శిక్షించాడు’ అని పోస్ట్ చేశారు.
ప్రియదర్శి ‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ఘాజీ’, ‘అర్జున్‌రెడ్డి’, ‘కేశవ’ తదితర చిత్రాలతో సహాయ నటుడిగా హిట్ అందుకున్నారు. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన ‘మల్లేశం’ సినిమా విడుదలై, మంచి టాక్ అందుకుంది. పద్మశ్రీ చింతకింద మల్లేశం జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. ఆయన ఎంతో కష్టపడి చేనేత వస్త్రాలను సులభంగా నేయడానికి యంత్రాన్ని కనుగొన్నారు. రాజ్ రాచకొండ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
