close

తాజా వార్తలు

ప్రతిరోజూ పండగే.. ఫస్ట్‌లుక్‌ చూశారా

హైదరాబాద్‌: యువ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న ‘ప్రతి రోజూ పండగే’ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. బుధవారం ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌, సత్యరాజ్‌ కనిపించారు. కట్టప్ప కుర్రాడిలా చిందులేస్తూ కనిపించారు. ‘వర్షంలో డ్యాన్స్‌ చేయడానికి మీకు వయసుతో సంబంధం లేదు. లాలీపాప్‌ తినడానికి, జీవితాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి కూడా వయసుతో ఎంతన్నది అక్కర్లేదు’ అని ఈ సందర్భంగా సాయిధరమ్‌ ట్వీట్‌ చేశారు.

యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశీ ఖన్నా కథానాయిక. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. కుటుంబ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.  ‘చిత్రలహరి’ హిట్‌ తర్వాత సాయిధరమ్‌ నటిస్తున్న సినిమా ఇది.

 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.