close

తాజా వార్తలు

ఆ రెండు పార్టీలూ నమ్మదగినవి కాదు: దేవెగౌడ

అందుకే ఒంటరిగానే ‘ఉప’ పోరుకు

బెంగళూరు‌: కర్ణాటకలో జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొనే ప్రసక్తే లేదని జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ తేల్చి చెప్పారు. డిసెంబర్‌ 5న జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా రెండు పార్టీలతోనూ తాము పొత్తుపెట్టుకోబోమన్నారు. ఆ రెండు పార్టీలూ నమ్మదగినవి కాదనీ.. రెండింటి నైజమూ ఒక్కటేనని విమర్శించారు.  ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 15 స్థానాలకు జరగబోయే  ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాలకు మేం సమాన దూరం పాటిస్తామన్నారు. 2018 ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వాస్తవానికి తనకు ఇష్టం లేదని దేవెగౌడ వెల్లడించారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నేతలు తనవద్దకు వచ్చారనీ.. కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఒప్పించారని తెలిపారు. తొలుత తాను ఒప్పుకోనప్పటికీ.. దీర్ఘకాలంగా వారు సంప్రదింపులు జరపడంతో అంగీకరించానన్నారు. 

ఆ రెండు పార్టీలూ దొందూదొందే 
కాంగ్రెస్‌, భాజపా రెండు పార్టీలూ నమ్మదగినవి కాదన్నారు. అందుకే ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలతో తాము కలిసి వెళ్లడంలేదన్నారు. కాంగ్రెస్‌, భాజపాలకు అవసరం వచ్చినప్పుడు తమ పార్టీని వాడుకున్నారనీ.. ఆ తర్వాత నాశనం చేశారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీల వైఖరి ఒక్కటేనన్నారు. అందువల్ల ఆ పార్టీలతో పొత్తు పెట్టుకొనే ప్రసక్తే లేదనీ.. ఈ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. 

అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేల రాజీనామాలతో ఇటీవల కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కింద సభాపతి 17 మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అనంతరం ఆ ఎమ్మెల్యేలంతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 15 స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహించనున్నట్టు ప్రకటించింది. మస్కి, రాజరాజేశ్వరి నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో అక్కడ ఎన్నికల నిర్వహణకు తేదీ ఇంకా ప్రకటించలేదు. దీంతో కర్ణాటకలోని 15 స్థానాలకు డిసెంబర్‌ 5న ఉప ఎన్నికలు జరగనున్నాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.