
తాజా వార్తలు
కోటవురట్ల (విశాఖ): విశాఖలోని ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విశాఖ జిల్లా కోటవురట్ల మండలం పాములవాక గ్రామంలో కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రియురాలు మృతిచెందగా.. ప్రియుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. పాములవాక గ్రామానికి చెందిన యాక నాయుడు (23), అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం సాయంత్రం 4గంటల సమయంలో వీరిద్దరూ గ్రామ సమీపంలోని అడవి రాజబాబుల ఆలయం వద్దకు చేరుకొని కాలక్షేపం చేశారు. రాత్రి 11గంటల సమయంలో శీతలపానీయంలో పురుగుల మందు కలుపుకొని తాగారు.
అనంతరం యువతి తన ఇంటికి ఫోన్ చేసి పురుగుల మందు తాగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఇరు కుటుంబాలకు చెందిన వారు అక్కడికి చేరుకొని వారిని నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ మధ్యాహ్నం చంద్రిక ప్రాణాలు కోల్పోగా.. యాక నాయుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోటవురట్ల ఎస్సై మధుసూదన్‌రావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
