
తాజా వార్తలు
గాయపడిన పరిణీతి చోప్రా
ముంబయి: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్లో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సైనా నెహ్వాల్‌గా నటి పరిణీతి చోప్రా కనిపించనున్నారు. ఇప్పటికే పరిణీతి ఈ సినిమా కోసం గత కొంతకాలం నుంచి స్టేడియంలోనే ఉంటూ బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె బ్యాడ్మింటన్ ఆడుతుండగా గాయపడ్డారు. మెడ వెనుక భాగంలో నెక్క్యాస్ట్ వేసుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నాకు ఎటువంటి గాయాలు కాకుండా నాతోపాటు చిత్రబృందం కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. కాకపోతే, ప్రమాదవశాత్తు గాయపడ్డాను. చాలా త్వరగా కోలుకుని మళ్లీ శిక్షణలో పాల్గొంటాను’ అని పరిణీతి పేర్కొన్నారు.
వచ్చే నెల నుంచి సైనా బయోపిక్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఇటీవల పరిణీతి ఇన్‌స్టాలో సైనాతో దిగిన ఓ ఫొటోను షేర్చేశారు. ‘ఇంకో 30 రోజుల్లో నేను తనలా కనిపించనున్నాను. తన పాత్రలో జీవించనున్నాను’ అని పేర్కొన్నారు. షూటింగ్‌కు ముందు ఇలా గాయపడటంతో కొన్నిరోజులపాటు చిత్రీకరణ ఆలస్యం కావచ్చు అని సినీవర్గాలు అనుకుంటున్నాయి. సైనా బయోపిక్కు ఆటంకాలు ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. ఈ బయోపిక్‌ను తెరకెక్కించాలని అనుకున్నప్పుడు తొలుత సైనా పాత్ర కోసం ఆ చిత్రబృందం శ్రద్ధాకపూర్‌ను తీసుకున్నారు. కాకపోతే, ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- పసిపాప రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
