
తాజా వార్తలు
చెన్నై: మహిళకు ప్రసవం చేసిన తరువాత ఆమె కడుపులో ఇంజక్షన్ చేసే సూదిని వదిలిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. రామ్‌నాథ్‌పురంలో నివాసం ఉండే కార్తీక్ అనే వ్యక్తి తన భార్య రమ్యను కాన్పు కోసం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో చేర్పించాడు. ఆమె ఈ నెల 19న ఆడపిల్లకు జన్మనిచ్చింది. తరువాత విపరీతంగా రక్తస్రావం కావడంతో పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. ఎక్స్‌రే తీయించిన వైద్యులు కడుపులో విరిగిపోయిన సూది ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రమ్యను మదురై ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స ద్వారా సూదిని తొలగించారు. కడుపులో సూదిని వదిలిపెట్టడంతో వైద్యులపై బాధితురాలి కుటుంబసభ్యులు రామ్‌నాథ్‌పురం ప్రాథమిక వైద్య కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడు, నర్స్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
