Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141401
            [news_title_telugu_html] => 

కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌: మరోసారి భారత్‌×పాక్‌!

[news_title_telugu] => కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌: మరోసారి భారత్‌×పాక్‌! [news_title_english] => Womens cricket to be part of Birmingham CWG confirms CGF [news_short_description] => కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌ మళ్లీ భాగమైంది. బర్మింగ్‌హామ్‌లో నిర్వహించే 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల టీ20ని చేర్చారు. ఐసీసీ, కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాయి. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన... [news_tags_keywords] => Womens cricket, Birmingham CWG,Commonwealth Games,cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-14 01:45:36 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌: మరోసారి భారత్‌×పాక్‌! - Womens cricket to be part of Birmingham CWG confirms CGF - EENADU
close

తాజా వార్తలు

కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌: మరోసారి భారత్‌×పాక్‌!

మెల్‌బోర్న్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌ మళ్లీ భాగమైంది. బర్మింగ్‌హామ్‌లో నిర్వహించే 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల టీ20ని చేర్చారు. ఐసీసీ, కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాయి. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన సీడబ్ల్యూజీలో తొలిసారి క్రికెట్‌ను చేర్చారు. దక్షిణాఫ్రికా అప్పుడు అగ్రస్థానంలో నిలిచింది.

బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడలు 2022 జులై 27 నుంచి ఆగస్టు 7 వరకు జరుగుతాయి. ఎనిమిది క్రికెట్‌ జట్లు ఇందులో పాల్గొంటాయి. భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య రసవత్తర సమరాలకు అవకాశం ఉంది. ‘ఈ రోజు చరిత్రాత్మకం. కామన్వెల్త్‌ క్రీడల్లోకి మళ్లీ క్రికెట్‌కు సాదరంగా స్వాగతం పలుకుతున్నాం’ అని సీజీఎఫ్‌ అధ్యక్షుడు డేమ్‌ లూయిస్‌ మార్టిన్‌ అన్నారు. కామన్వెల్త్‌లో క్రికెట్‌ చేర్చడాన్ని ఐసీసీ, ఈసీబీ స్వాగతించాయి.

ఐసీసీ నిబంధనల ప్రకారమే కామన్వెల్త్‌ క్రికెట్‌ నిర్వహిస్తారు. అన్ని మ్యాచ్‌లకు ఎడ్జ్‌బాస్టన్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ మధ్యే ముగిసిన పురుషుల వన్డే ప్రపంచకప్‌లో అక్కడ మరపురాని మ్యాచ్‌లు జరిగిన సంగతి తెలిసిందే. మహిళల క్రికెట్‌ చరిత్రలో ఇది అతిపెద్ద మలుపు అని నిర్వాహకులు చెబుతున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.