
తాజా వార్తలు
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ ప్రధాన కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ కోచ్ రసెల్ డోమింగో ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్కు చెందిన స్టీవ్ రోడ్స్ స్థానంలో రసెల్ నియమితుడయ్యాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్రకటించింది. రసెల్ కోచ్గా రెండేళ్లు కొనసాగుతాడని తెలిపింది. ‘కోచ్గా అతడికి మంచి అనుభవం ఉంది. జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు అతడు ఇచ్చిన ప్రెజెంటేషన్ ఎంతో ఆకట్టుకుంది’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ అన్నాడు. ఇటీవల జరిగిన శ్రీలంకతో సిరీస్కు బంగ్లాదేశ్ తాత్కాలిక కోచ్గా బీసీబీ డైరెక్టర్ ఖలీద్ మహ్ముద్ పనిచేశారు. ఈ సిరీస్లో బంగ్లా 0-3తో ఓడిన సంగతి తెలిసిందే. గతంలో రసెల్ దక్షిణాఫ్రికా జట్టుకు కోచ్గా పని చేశాడు. 2011లో అసిస్టెంట్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన అతడు 2013లో ప్రధాన కోచ్గా ఎంపికయ్యాడు. 2017 వరకు సఫారీలకు కోచ్గా సేవలు అందించాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఎన్కౌంటర్తో న్యాయం జరగలేదు
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్కౌంటర్పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఆ రెండు రోజులూ ఏం జరిగింది?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
