Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144560
            [news_title_telugu_html] => 

కోహ్లీ ర్యాంకుకు స్మిత్‌ ఎసరు!

[news_title_telugu] => కోహ్లీ ర్యాంకుకు స్మిత్‌ ఎసరు! [news_title_english] => ICC Rankings Smith closes in as Kohli maintains top spot [news_short_description] => ఐసీసీ టెస్టు ర్యాంకుల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ జోరు కనబరిచాడు. బ్యాట్స్‌మెన్‌ జాబితాలో రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలోని విరాట్‌ కోహ్లీకి ఎసరు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాడు.... [news_tags_keywords] => virat kohli,steve smith,icc test rankings [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 17:29:17 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కోహ్లీ ర్యాంకుకు స్మిత్‌ ఎసరు! - ICC Rankings Smith closes in as Kohli maintains top spot - EENADU
close

తాజా వార్తలు

కోహ్లీ ర్యాంకుకు స్మిత్‌ ఎసరు!

దుబాయ్‌: ఐసీసీ టెస్టు ర్యాంకుల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ జోరు కనబరిచాడు. బ్యాట్స్‌మెన్‌ జాబితాలో రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలోని విరాట్‌ కోహ్లీకి ఎసరు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. వీరిద్దరి మధ్య పాయింట్ల అంతరం కేవలం తొమ్మిదే కావడం గమనార్హం. విరాట్‌ 922తో ఉండగా స్మిత్‌ 913తో కొనసాగుతున్నాడు. యాషెస్‌ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అతడు వరుస శతకాలు చేసి ఊపుమీదున్న సంగతి తెలిసిందే. ఇక భారత్‌ నుంచి విరాట్‌ తర్వాత ఛెతేశ్వర్‌ పుజారా మాత్రమే టాప్‌-10లో కొనసాగుతున్నాడు. కేన్‌ విలియమ్సన్‌ మూడు, పుజారా నాలుగో స్థానాల్లో ఉన్నారు.

శ్రీలంక సారథి దిముతు కరుణరత్నె నాలుగు స్థానాలు మెరుగై టాప్‌-10లో ప్రవేశించాడు. 8వ ర్యాంకు సాధించాడు. అయిడెన్‌ మార్క్రమ్‌ (దక్షిణాఫ్రికా) 6, ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ 9వ స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో ఆసీస్‌ ఆటగాడు ప్యాట్‌ కమిన్స్‌ తన అగ్రస్థానాన్ని ఆస్వాదిస్తున్నాడు. రవీంద్ర జడేజా ఆరు నుంచి ఐదో స్థానానికి ఎగబాకాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ పదో స్థానానికి పరిమితం అయ్యాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో జడ్డూ మూడో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచుల సిరీస్‌లో టీమిండియా 0-1తో ఓటమి పాలైతే తన అగ్రస్థానాన్ని న్యూజిలాండ్‌కు కోల్పోతుంది. మూడో స్థానానికి పడిపోతుంది. ప్రస్తుతం కోహ్లీసేన 113 పాయింట్లతో ఉన్న సంగతి తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.