Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 129685
            [news_title_telugu_html] => 

షీలా దీక్షిత్‌ చివరి ఆదేశాలు ఇవే!

[news_title_telugu] => షీలా దీక్షిత్‌ చివరి ఆదేశాలు ఇవే! [news_title_english] => Sheila Dikshits Last Instruction was to protest at bjp office if priyanka up govt standoff didnot end [news_short_description] => దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ దిగ్గజ నాయకురాలు షీలా దీక్షిత్‌ శనివారం సాయంత్రం అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తుది శ్వాస వరకు రాజకీయాల్లో చురుకుగా ఉన్న ఆమె నిరంతరం పార్టీ శ్రేణులను...... [news_tags_keywords] => Sheila Dikshit,congress,delhi,BJP [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-21 09:59:03 [news_isactive] => 1 [news_status] => 2 ) )
షీలా దీక్షిత్‌ చివరి ఆదేశాలు ఇవే! - Sheila Dikshits Last Instruction was to protest at bjp office if priyanka up govt standoff didnot end - EENADU
close

తాజా వార్తలు

షీలా దీక్షిత్‌ చివరి ఆదేశాలు ఇవే!

దిల్లీ: దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ దిగ్గజ నాయకురాలు షీలా దీక్షిత్‌ శనివారం సాయంత్రం అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తుది శ్వాస వరకు రాజకీయాల్లో చురుకుగా ఉన్న ఆమె నిరంతరం పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగేవారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పటికప్పుడూ దిశానిర్దేశం చేసేవారు. అలా శుక్రవారం ఆమె పార్టీ వర్గాలకు ఓ సందేశం పంపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ, ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం శనివారం ముగియకపోతే.. భాజపా ప్రధాన కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టాలని షీలా ఆదేశించారట. ఈ మేరకు దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్ మార్గ్‌లో ప్రదర్శన నిర్వహించేందుకు నాయకులు, కార్యకర్తలు తరలిరావాలంటూ షీలా దీక్షిత్‌ పేరిట దిల్లీ కాంగ్రెస్‌ శాఖ పార్టీ శ్రేణులకు ఓ సందేశం పంపింది. గతంలో ఆమె కేబినెట్‌లో పనిచేసిన ఓ వ్యక్తి ఈ విషయాలు వెల్లడించారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో సోన్‌భద్ర కాల్పుల ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీని శుక్రవారం పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే వారిని కలిసే వరకు వెళ్లేది లేదన్న ప్రియాంక.. తనను నిర్బంధించిన అతిథి గృహం వద్దే శనివారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. దీంతో తన లక్ష్యం నెరవేరిందన్న ఆమె ధర్నా ముగించి తిరిగి వెళ్లిపోయారు. వివాదం సద్దుమణిగింది. లేదంటే షీలా ఆదేశాల మేరకు దిల్లీలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు కొనసాగేవని పార్టీ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.