Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143448
            [news_title_telugu_html] => 

వరద నియంత్రణలో సర్కార్‌ విఫలమైంది

[news_title_telugu] => వరద నియంత్రణలో సర్కార్‌ విఫలమైంది [news_title_english] => sujanaChowdary Pressmeet at visakha [news_short_description] => వరద నియంత్రణలో వైకాపా సర్కార్ పూర్తిగా విఫలమైందని భాజపా నేత సుజనాచౌదరి విమర్శించారు. ఎగువ రాష్ట్రాలు వరదపై ముందే సమాచారం ... [news_tags_keywords] => Visakha,sujanaChowdary,Pressmeet [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => iRRPkBedmQE [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 13:57:53 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వరద నియంత్రణలో సర్కార్‌ విఫలమైంది - sujanaChowdary Pressmeet at visakha - EENADU
close

తాజా వార్తలు

వరద నియంత్రణలో సర్కార్‌ విఫలమైంది

భాజపా నేత సుజనాచౌదరి

విశాఖపట్నం: వరద నియంత్రణలో వైకాపా సర్కార్ పూర్తిగా విఫలమైందని భాజపా నేత సుజనాచౌదరి విమర్శించారు. ఎగువ రాష్ట్రాలు వరదపై ముందే సమాచారం అందించినప్పటికీ.. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన విశాఖలో ఆరోపించారు. ముంపు గ్రామాల ప్రజలకు కనీసం రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వరద బాధితులకు నిత్యావసరాలు, ఆహారం, మంచినీరు అందించాలని కోరారు. 

వరద ఉద్ధృతిని గవర్నర్‌ పరిశీలించారని, ఆయన నివేదిక అందించాక.. సాయంపై కేంద్రం నిర్ణయం ఉంటుందని సుజనా చౌదరి వెల్లడించారు. గతంలో ఉన్న సమస్యలు ఈ 70 రోజుల్లో రెట్టింపయ్యాయని దుయ్యబట్టారు. వేలుకు దెబ్బతగిలిందని మందు వేసుకోకుండా నరుక్కుంటామా? అని వైకాపా నేతలను ప్రశ్నించారు. పరిపాలించే తీరు ఇదికాదని రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. వ్యక్తిగత కక్షలతో రాష్ట్రానికి వైకాపా తీరని నష్టం చేస్తోందని, ఇకనైనా పంథాను మార్చుకోవాలని సుజనాచౌదరి సూచించారు. రివర్స్‌టెండరింగ్‌ గిమ్మిక్కులా కనిపిస్తోందని ఆరోపించారు.

సరైన సలహాదారు లేరా!: విష్ణుకుమార్‌రాజు
మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ.. సీఎం పనితీరు చూస్తుంటే సరైన సలహాదారు లేరనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రజావేదికను ఒక్కరోజులో కూల్చారని, ఇసుకు విధానంపై ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. ఇసుక విధానంపై నిర్ణయం తీసుకోకపోవడంతో లక్షలమంది ఇబ్బంది పడుతున్నారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రోజులోనే అపాయింట్‌మెంట్‌ దొరికేదని, ఇప్పుడు మాత్రం 70 రోజులైనా దొరకడం లేదని ఆరోపించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.