Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143506
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్ @ 5 PM [news_title_english] => FIVE PM NEWS [news_short_description] => [news_tags_keywords] => TOP NEWS,5 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 17:00:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్ @ 5 PM - FIVE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. వరద బాధితులను ఆదుకోవాలి: చంద్రబాబు

వరద బాధితులకు తెదేపా నేతలు, కార్యకర్తలు అండగా ఉండాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. సహాయక చర్యల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జులు, ఇతర నేతలు పాల్గొనాలన్నారు. బాధిత ప్రజానీకానికి అందరూ సంఘీభావంగా ఉండాలని సూచించారు. కృష్ణా నది వరదల్లో అనేక మంది నిరాశ్రయులు అయ్యారని, ఇళ్లు నీటమునిగి కట్టుబట్టలతో మిగిలారన్నారు. అలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనేక జిల్లాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. యురేనియం సర్వే అడ్డుకోవాలి: రేవంత్‌

యురేనియం వెలికితీస్తే నల్లమల ప్రాంతమే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రభావితమవుతుందని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నల్లమలలో యురేనియం అన్వేషణ అనుమతుల నేపథ్యంలో శనివారం ఆయన నాగర్‌కర్నూలు జిల్లా ఆమ్రాబాద్‌ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. యురేనియం వెలికితీయడం వల్ల నల్లమలలోని అరుదైన వన్యప్రాణులు, ఔషధ మొక్కలు, గిరిజన జాతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 

3. భాజపాలో చేరిన కపిల్‌ మిశ్రా

మాజీ మంత్రి, ఆప్‌ తిరుగుబాటు నేత కపిల్‌ మిశ్రా భాజపాలో చేరారు. ఆప్‌ మహిళా విభాగం చీఫ్‌ రిచా పాండేతో కలిసి ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు శ్యామ్‌ జాజు, దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్‌ తివారీ సమక్షంలో వీరిద్దరూ ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కపిల్‌ మిశ్రా భాజపాకు అనుకూలంగా ప్రచారం చేశారు. దిల్లీలోని కార్వాల్‌నగర్‌ నుంచి ఆప్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన కపిల్‌ మిశ్రా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో ఆయనపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద దిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రాం నివాస్‌ గోయల్‌ ఇటీవల అనర్హత వేటు వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత జెండాలతో భూటాన్‌లో మోదీకి ఘనస్వాగతం

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు భూటాన్‌ చేరుకున్నారు. ఈ ఉదయం పారో విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని లొటాయ్‌ షెరింగ్‌ సాదర స్వాగతం పలికారు. అనంతరం భూటాన్‌ సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. పారో ఎయిర్‌పోర్టు నుంచి మోదీ.. భూటాన్‌ రాజధాని థింపుకు బయల్దేరారు. ఆయన వెళ్తున్న మార్గంలో స్థానిక ప్రజలు భారతీయ, భూటాన్‌ జెండాలు పట్టుకుని మోదీకి ఘన స్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రెండో రోజు సందడిగా ‘సైమా’ అవార్డుల వేడుక

6. ఎయిమ్స్‌కు మాయావతి..జైట్లీ ఆరోగ్యంపై ఆరా

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేందుకు నేతలు ఎయిమ్స్‌కు తరలివస్తున్నారు. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎయిమ్స్‌కు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9న అరుణ్‌ జైట్లీకి శ్వాస తీసుకోవడంలో ఎయిమ్స్‌లో చేర్పించిన విషయం తెలిసిందే. కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీరేంద్ర సింగ్‌ ధనోవా, భాజపా నేత సతీష్‌ ఉపాధ్యాయ్‌, కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ ఎయిమ్స్‌కు వచ్చి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చెమటోడ్చిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు

వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా భారత జట్టు ఈనెల 22 నుంచి విండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌తోనే భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్‌పై మరింత ఆసక్తి పెరిగింది. అంతకన్నా ముందు భారత్‌ X విండీస్‌ XI జట్టుతో శనివారం నుంచి మూడు రోజులపాటు సన్నాహక మ్యాచ్‌ ఆడనుంది. పుజారా, అజింక్యా రహానే, రోహిత్‌శర్మ, వృద్ధిమాన్‌ సాహా, జస్ప్రిత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌  సన్నాహక మ్యాచ్‌లో ఆడనున్నారని తెలుస్తోంది. ఆంటిగ్వాలో వీరంతా సాధన చేస్తూ చెమటోడ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మారుతిలో 3000 ఉద్యోగాల కోత

వాహనరంగం మందగమనంలో ఉన్న నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి ఆటోమొబైల్‌ సంస్థలు. దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కూడా తాత్కాలిక ఉద్యోగాల్లో భారీగా కోత విధించింది. కాంట్రాక్టులు రెన్యువల్‌ చేయకపోవడంతో 3వేల మంది తాత్కాలిక సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ స్వయంగా వెల్లడించారు. శాశ్వత ఉద్యోగాల్లో ఎలాంటి కోత ఉండబోదని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భార్య కాపురానికి రాలేదని ట్యాంక్‌పైనుంచి దూకాడు

తన భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన యాదగిరి కొన్ని నెలలుగా తన భార్య కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.దీంతో గ్రామంలోని వాటర్‌ ట్యాంక్‌పై నుంచి అమాంతం కిందకు దూకేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వైభవంగా రాఘవేంద్ర స్వామి రథోత్సవాాలు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.