Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000031
            [news_title_telugu_html] => 

నీటి బ్యాంకుల మరియాపురం

[news_title_telugu] => నీటి బ్యాంకుల మరియాపురం [news_title_english] => Mariapuram which suffered from irrigation and drinking water [news_short_description] => గీసుకొండ: సాగు, తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్న ఆ గ్రామం ఎవరో వస్తారు, పరిష్కరిస్తారని చూడకుండా కేంద్ర ప్రభుత్వ జలశక్తి అభియాన్‌ పథకాన్ని అందిపుచ్చుకొని నీటి బ్యాంకులు నిర్మించి నీటి కొరత పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తోంది మరియాపురం. [news_tags_keywords] => irrigation,drinking water, Mariapuram [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => jZ4ksAZLiEk [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 23:18:22 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నీటి బ్యాంకుల మరియాపురం - Mariapuram which suffered from irrigation and drinking water - EENADU
close

తాజా వార్తలు

నీటి బ్యాంకుల మరియాపురం

గీసుకొండ: ఎవరో వస్తారు, పరిష్కరిస్తారని ఆ గ్రామం ఎదురు చూడలేదు. సాగు, తాగునీటి కష్టాలను అధిగమించేందుకు ఉన్న అన్ని దారులనూ వెతికింది. కేంద్ర ప్రభుత్వ జలశక్తి అభియాన్‌ పథకాన్ని అందిపుచ్చుకొని నీటి బ్యాంకులు నిర్మించుకుంది. నీటి కొరత పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తోంది మరియాపురం. సొంతంగా జలనిధిని తయారు చేసుకోవడంతో భూగర్భ జలాలు పెరిగి వట్టిపోయిన బోర్లు తిరిగి నిరంతరాయంగా నీటిని అందిస్తున్నాయి. గతంలో నీటి ఎద్దడి ఎదుర్కొన్న వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం మరియాపురం గ్రామంలో ప్రస్తుతం తాగు, సాగు నీటి కష్టాలు తీరాయి. గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌ కృషి కొద్ది రోజులలోనే ఊరు రూపురేఖలను మార్చేసింది. నీటి కొరతను అధిగమించేందుకు గ్రామస్థులకు ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించి ఇంటికొకటి చొప్పున ఇంకుడు గుంత ఉండేలా చర్యలు తీసుకున్నారు. వర్షం నీటిని ఒడిసిపడుతూ.. జలనిధులను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో వర్షపు నీరు మురుగు కాల్వల ద్వారా రోడ్డుపైకి వచ్చి బురదమయంగా మారి దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. అటువంటి ప్రదేశాలను గుర్తించి కమ్యూనిటీ అంతర్‌ శ్రవణ ట్యాంకులను నిర్మించారు. ప్రభుత్వ కార్యాలయాలలో సైతం ఇంకుడు గుంతలను నిర్మించారు. భూగర్భ జలాలను పెంచడం కోసం వ్యవసాయ బావుల వద్ద రైతులకు అవగాహన కల్పించి శ్రమదానంతో పెద్దపెద్ద పంట కుంటలను నిర్మించారు. గ్రామ సర్పంచ్‌ చొరవకు స్థానిక అధికారులు తోడవడంతో మరియాపురం గ్రామం సస్యశ్యామలంగా మారింది. పంటకుంటలు ఇటీవల కురిసిన వర్షాలకు నిండటంతో బోర్లు ఉన్న ప్రాంతాలలో భూగర్భజలాలు పెరగడంతో నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.భవిష్యత్‌ తరాలకు ఇవ్వాల్సిన నిజమైన సంపద నీరేనని మరియాపురం నిరూపిస్తోంది. నీటి ఎద్దడిని అధిగమించి జల నిల్వలను పెంచుకున్న ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.