Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144481
            [news_title_telugu_html] => 

కశ్మీర్‌లో తెరుచుకున్న పాఠశాలలు

[news_title_telugu] => కశ్మీర్‌లో తెరుచుకున్న పాఠశాలలు [news_title_english] => Primary schools in Jammu and Kashmir reopen today [news_short_description] => జమ్మూకశ్మీర్‌లో దాదాపు రెండు వారాల తర్వాత కొన్ని ప్రాథమిక పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. రాజోరీలోని అన్ని పాఠశాలలను పునఃప్రారంభించారు.......... [news_tags_keywords] => Article 370,J&K,Kashmir [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 23:17:59 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కశ్మీర్‌లో తెరుచుకున్న పాఠశాలలు - Primary schools in Jammu and Kashmir reopen today - EENADU
close

తాజా వార్తలు

కశ్మీర్‌లో తెరుచుకున్న పాఠశాలలు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో దాదాపు రెండు వారాల తర్వాత కొన్ని ప్రాథమిక పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. రాజోరీలోని అన్ని పాఠశాలలను పునఃప్రారంభించారు. ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నప్పటికీ కొన్ని సున్నిత ప్రాంతాల్లో మాత్రం పారామిలటరీ దళాలను ఉంచారు. కశ్మీర్‌లోయలో హింసాత్మక ఘటనలేవీ చోటు చేసుకోలేదు. శ్రీనగర్‌లో మాత్రం అక్కడక్కడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనల్లో ఏడుగురు గాయపడినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఇప్పటివరకు 50,000 ల్యాండ్‌లైన్‌ ఫోన్ల సర్వీసులను పునరుద్ధరించారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితులను బట్టి మధ్య, ఉన్నత పాఠశాలలు కూడా ప్రారంభిస్తామని ప్రభుత్వాధికారులు తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు ప్రకటన నేపథ్యంలో ముందస్తు చర్యగా జమ్మూకశ్మీర్‌లో పాఠశాలలను మూసివేసిన విషయం తెలిసిందే.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.