close

తాజా వార్తలు

పోలవరానికి పూర్తిగా సహకరించండి: వెంకయ్య

ఉపరాష్ట్రపతిని కలిసిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్

దిల్లీ: నవ్యాంధ్ర ప్రజల జీవనాడి ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి  గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు సూచించారు. శుక్రవారం ఉదయం ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చిన కేంద్రమంత్రికి 1981-82లో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి నేపథ్యాన్ని వివరించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారం అందించాలని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా కోరారు. 
గోదావరి, పెన్నా నదులను కావేరితో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి.. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లోని కరవు ప్రాంతాలకు సాగు, తాగు నీరందించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఆ మొత్తాన్ని నాబార్డు ద్వారా విడుదల చేయించేందుకు అవసరమైన చొరవ తీసుకోవాలన్నారు. నిధుల్లేక పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కాకూడదన్నదే తన ఆకాంక్ష అన్నారు. ప్రాజెక్టు విస్తరణ విషయంలో అడ్డంకుల్ని తొలగించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని వెంకయ్యనాయుడు సూచించారు. దీనికి సానుకూలంగా స్పందించిన గజేంద్ర షెకావత్ ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చించి, సత్వరం సానుకూల చర్యలు చేపడతామని ఉపరాష్ట్రపతికి తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.