
తాజా వార్తలు
హృతిక్ రోషన్
ముంబయి: బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు స్వదేశంతోపాటు విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత హ్యాండ్సమ్ వ్యక్తి హృతిక్ అని అమెరికాకు చెందిన ఓ ఏజెన్సీ పేర్కొంది. ‘కహో నా ప్యార్ హై’ చిత్రంతో 2000లో హృతిక్ నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అప్పట్లో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్‌ను అమ్మాయిలు బాగా ఇష్టపడేవారు. కానీ హృతిక్ రాకతో ఆయనపై మనసు మళ్ళింది. ఆయన అందానికి అమ్మాయిలు ఫిదా అయ్యారు. డిసెంబరులో హృతిక్ తొలి సినిమా విడుదల కాగా.. ఆ తర్వాత 11 నెలలకే ఆయన వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమ్మతితో తను ప్రేమించిన అమ్మాయిని సుసానే ఖాన్‌ను మనువాడారు.
కాగా కపిల్ శర్మ షోలో హృతిక్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తొలి సినిమా తర్వాత 30 వేలకుపైగా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని తెలిపారు. తన అందం వెనుక రహస్యం గురించి మాట్లాడుతూ.. ‘దీనికి కారణం బ్రొకోలి.. సరదాగా చెప్పా. నా ముఖాన్ని చూసి నాకు టైటిల్స్ ఇస్తున్నారు, దానికి ధన్యవాదాలు. దీన్ని విజయంగా నేను పరిగణించను. నాకు తెలిసి మనిషికి నిజమైన విజయం వారి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నప్పుడే. ఓ మంచి వ్యక్తిత్వం ఎప్పుడూ ఇతరుల్ని ఆకర్షిస్తుంది’ అని హృతిక్ అన్నారు. ‘వార్’ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన తొలి సినిమా ఇది కావడం విశేషం. భారీ యక్షన్ సినిమాగా దీన్ని రూపొందించారు. వాణీ కపూర్ కథానాయిక. అక్టోబరు 2న ఈ సినిమా విడుదల కాబోతోంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
