
తాజా వార్తలు
దిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా కొలిక్కి రావడం లేదు. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతివ్వాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ మంతనాలు చేస్తోంది. ఈ ఉదయం సోనియా నివాసంలో పార్టీ పెద్దలు భేటీ అయి దీనిపై చర్చలు జరిపారు. తాజాగా మరోసారి వీరంతా సమావేశమయ్యారు. అటు రాజస్థాన్‌లో ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా దిల్లీ చేరుకున్నారు.
శివసేనతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా లేదా.. బయటి నుంచి మద్దతు ఇవ్వాలా అనే అంశంపై కాంగ్రెస్ నేతలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. శివసేనతో చేతులు కలిపితే ఎదురయ్యే ఇబ్బందులను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత కాంగ్రెస్ తన నిర్ణయం వెల్లడించనుంది.
మరోవైపు శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సుముఖంగా ఉన్న ఎన్సీపీ మాత్రం కాంగ్రెస్ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసినందున ఆ పార్టీ నిర్ణయమే అంతిమమని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిర్ణయం కీలకంగా మారింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
