close
ప్రవాస తెలుగు రచయితలకు శుభవార్త

 రెండు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్న టీఏజీఎస్‌  
 రచనలు పంపాల్సిన ఆఖరు తేదీ డిసెంబరు 1,2019

ఈనాడు, దిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస తెలుగు రచయితల కోసం శాక్రమెంటో తెలుగు సంఘం (టీఏజీఎస్‌) యూఏఎన్‌ మూర్తి మెమోరియల్‌  రచనల పోటీ నిర్వహిస్తోందని సంఘ ట్రస్టీ వెంకట్‌ నాగం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2003 నుంచి శాక్రమెంటో తెలుగు సంఘం.. తెలుగు భాష, సంస్కృతి వ్యాప్తికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే విదేశాల్లో నివసించే ఔత్సాహిక రచయితలకు రెండు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని వెంకట్‌ వివరించారు. 

ప్రధాన విభాగం : విదేశాల్లో నివసిస్తున్న ఔత్సాహిక ప్రవాస తెలుగు రచయితల నూతన, అముద్రిత తెలుగు రచనలు. 18 ఏళ్ల వయసు దాటిన వారికి

ఉత్తమ కథానిక :  ప్రథమ బహుమతికి 116 యూఎస్‌ డాలర్లు, ద్వితీయ బహుమతి 58 డాలర్లు, తృతీయ బహుమతి 28 డాలర్లు 

ఉత్తమ కవిత : ప్రథమ బహుమతి 116 డాలర్లు, ద్వితీయ బహుమతి 58 డాలర్లు, తృతీయ బహుమతి 28 డాలర్లు 

అనువాద కథ రచన విభాగం (18 ఏళ్ల లోపు వారికి) : ప్రవాస యువ రచయితలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రత్యేక విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలో పాల్గొనే వారి వయసు డిసెంబరు1, 2019 నాటికి 18 ఏళ్లు ఉండాలి

ఉత్తమ అనువాద కథ: 13 ఏళ్ల వయసు లోపు వారికి.  ప్రథమ బహుమతికి 116 యూఎస్‌ డాలర్లు, ద్వితీయ బహుమతి 58 డాలర్లు, తృతీయ బహుమతి 28 డాలర్లు 

ఉత్తమ అనువాద కథ : 13 నుంచి 18 ఏళ్ల వయసు వారికి.  ప్రథమ బహుమతికి 116 యూఎస్‌ డాలర్లు, ద్వితీయ బహుమతి 58 డాలర్లు, తృతీయ బహుమతి 28 డాలర్లు 

 రచనలు  telugusac@yahoo.com కు డిసెంబరు 1, 2019లోగా పంపాలి.  కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో జనవరి 11,2020న నిర్వహించనున్న టీఏజీఎస్‌ 16వ వార్షికోత్సవం, సంక్రాంతి సంబరాల సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేస్తారు.  మరిన్ని వివరాలకు www.sactelugu.org,http://tinyurl.com/tagscontest నాగ్‌ (859-536-5308), సత్యవీర్‌ (216-262-4905), మనోహర్‌ (916-524-9052), వెంకట్‌ (408-887-0284)లను సంప్రదించవచ్చు. 

వార్తలు / కథనాలు

మరిన్ని