News in pics : చిత్రం చెప్పే విశేషాలు (03-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 03 May 2024 03:45 IST
1/6
హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియం అభిమాన సంద్రంతో హోరెత్తింది.. గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు నగరవాసులు పోటెత్తారు. బంతి బంతికి ఉత్సాహపరుస్తూ.. ఆటను ఆస్వాదించారు.

2/6
ఆదిలాబాద్‌: పట్టణంలోని పాత జాతీయ రహదారి నుంచి కొత్త హౌజింగ్‌బోర్డుకు వెళ్లేదారి అందుకు భిన్నంగా మండుటెండల్లో చల్లదనాన్ని పంచుతోంది. వివేకానంద కూడలి వరకు దారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు రహదారిపై పచ్చని పందిరి వేసినట్లుగా కమ్ముకున్నాయి.పట్టణంలో ఎండల్లో తిరిగిన వారు ఆ దారి మీదుగా వెళ్లగానే చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు.

3/6
ఖమ్మం: రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ప్రత్యామ్నాయంగా ప్రయాణ సమయంలో అనేక మంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చల్లని కళ్లద్దాలు, మాస్కులు, టోపీలు, బ్యాటరీ ఫ్యాన్లు వినియోగిస్తున్నారు.

4/6
తమిళనాడు: కోయంబత్తూరు సమీప ఉక్కడం కోట్టైమేడులోని మారియమ్మ ఆలయంలో వారం రోజుల క్రితం వార్షిక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రథోత్సవం బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొని రథాన్ని లాగి మతసామరస్యాన్ని చాటారు. అలాగే భక్తులకు శీతలపానీయాలు, మజ్జిగ అందజేశారు.

5/6
తమిళనాడు: కోవై సమీప తిమ్మపాళ్యానికి చెందిన కిట్టాన్‌ మేకల ఫాం నిర్వహిస్తున్నాడు. సాధారణంగా మేకలు రెండు లేదా 3 పిల్లల్ని ఈనుతాయి. ఇతని ఫాంలోని ఓ మేక గురువారం ఏకంగా 7 పిల్లల్ని ఈనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

6/6
హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కలిగించేలా బల్దియా నడుం బిగించింది. పోలింగ్‌ తేదీ, ఇతర వివరాలతో భారీ హీలియం బెలూన్‌ను సచివాలయంలో ఏర్పాటు చేసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు