‘ఈ ఎన్నికలు వైకాపా పతనానికి నాంది’

తాజా వార్తలు

Updated : 14/02/2021 20:23 IST

‘ఈ ఎన్నికలు వైకాపా పతనానికి నాంది’

తెదేపా అధినేత చంద్రబాబు

అమరావతి: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే స్థాయికి వైకాపా చేరుకుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బలవంతపు ఏకగ్రీవాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసం ఇలాంటి పనులు చేయడం అత్యంత దారుణమని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చీకటి రాజకీయాలకు తెరలేపే పరిస్థితికి దిగజారారని ధ్వజమెత్తారు. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు ముందుకొచ్చారని.. అందుకు వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. మొదటి రెండు దశల్లో జరిగిన ఓట్ల శాతాన్ని చూస్తే.. వైకాపా పతనం ప్రారంభమైనట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.

‘‘రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 39శాతానికిపైగా స్థానాల్లో తెదేపా బలపర్చిన అభ్యర్థులే గెలిచారు. రాష్ట్ర ప్రజలందరూ ఆ ఎన్నికల సరళిని గమనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వైకాపా ఎంపీలు, మంత్రులకు కంచుకోటగా చెప్పుకునే స్థానాల్లోనూ తెదేపా సత్తా చాటింది. భవిష్యత్తులో ఈ నాయకులకు వారి సొంత గ్రామాల్లోనూ మద్దతు లేకుండా పోతుంది. అనేక చోట్ల రీకౌంటింగ్‌ కోరితే తిరస్కరించారు. వైకాపా నాయకుల వ్యవహారశైలి, అరాచకాల వల్ల ప్రజలు నిలదీసే రోజులు దర్గర్లోనే ఉన్నాయి. ఎన్ని రకాలుగా భయపెట్టినా ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారు’’

‘‘నా జీవితంలో తొలిసారి పంచాయతీ ఎన్నికలను సమీక్షించాను. మా చొరవ వల్లే ఎన్నికల్లో 82 శాతం పోలింగ్‌ నమోదైంది. కొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏజెంట్లను బయటకు పంపి అక్రమాలకు పాల్పడ్డారు. ముందు సర్పంచి, తర్వాత వార్డు ఓట్లను లెక్కించాలి. రాత్రి పూట ఎందుకు ఓట్లను లెక్కిస్తున్నారు? కొన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో రాత్రి పూట కరెంటు పోతోంది. ఓట్ల లెక్కింపు సమయంలో కరెంట్‌ పోకుండా చర్యలు తీసుకోవాలి. కౌంటింగ్‌ కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు పెట్టాలని మేం కోరాం.  రెండో విడతలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా?వైకాపా నేతలు అడిగిన వెంటనే రీకౌంటింగ్‌కు అనుమతిచ్చారు. తెదేపా నేతలు కోరితే మాత్రం రీకౌంటింగ్‌కు అవకాశం ఇవ్వరు. అక్రమాలకు కొమ్ముకాసే అధికారులపై చర్యలు తప్పవు’’ అని చంద్రబాబు తెలిపారు.

వైకాపా ఎమ్మెల్యేలు వాలంటీర్లతో ప్రచారం చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అభ్యర్థులను భయపెట్టి, నామినేషన్‌ వేయకుండా చేస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో విడత ఎన్నికల్లో ప్రజలు ధైర్యంగా ఓటేయలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎస్‌ఈసీపై ఉందన్నారు. 

ఇవీ చదవండి..

జనసేన నేతలపై అక్రమ కేసులు: నాదెండ్ల

ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికలు: సోమువీర్రాజుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని