సాగర్‌ ఉపఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారు

తాజా వార్తలు

Updated : 17/03/2021 12:07 IST

సాగర్‌ ఉపఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారు

దిల్లీ: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి జానారెడ్డి పేరును అధిష్ఠానం అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు జానారెడ్డి పేరును అధినేత్రి సోనియా గాంధీ ఆమోదించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇప్పటికే నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 17న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 30 వరకు నామినేషన్ల దాఖలుకు ఈసీ గడువు విధించింది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్‌ 3న నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువుగా నిర్ణయించింది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని