మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్‌ చేయాలి: ఉమా

తాజా వార్తలు

Published : 16/09/2020 14:27 IST

మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్‌ చేయాలి: ఉమా

విజయవాడ: దుర్గమ్మ రథానికి ఉండే వెండి సింహాలు అదృశ్యం కావడానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను బాధ్యుడిని చేస్తూ ఆయన్ని బర్తరఫ్‌ చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్‌ చేశారు. విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి సంబంధించిన వెండి రథానికి ముందు, వెనుక భాగాన అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యమైన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో బుధవారం పార్టీ నేతలతో కలిసి దుర్గమ్మ ఆలయాన్ని దేవినేని సందర్శించి రథాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆలయంలో ఇలాంటి ఘటన జరగడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఆలయ ఈవో బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తప్పును కప్పిపుచ్చి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ ఈవోను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని