తెరాస, భాజపాల మధ్యే అసలు పోటీ

తాజా వార్తలు

Published : 22/01/2020 22:50 IST

తెరాస, భాజపాల మధ్యే అసలు పోటీ

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో తమకు ఎవరూ పోటీలేరని చెప్పిన తెరాస భాజపాను లక్ష్యంగా చేసుకొని అక్రమాలకు పాల్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని లక్ష్మణ్‌ విమర్శించారు. స్థానికంగా సెలవులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారని అన్నారు. పుర పోరులో తెరాస, భాజపాల మధ్యే అసలు పోటీ నెలకొందని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. డబీర్‌పురాలో ఓటు వేయడానికి ముస్లింలు ముందుకు రాలేందటే ఎంఐఎంపై ఎంత విరక్తితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా సీట్లు, ఓట్ల సంఖ్య పెంచుకుంటామని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని