కేసులు దాచిపెడితే దావానలమే: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 16/04/2020 01:08 IST

కేసులు దాచిపెడితే దావానలమే: చంద్రబాబు

హైదరాబాద్‌: కరోనా కేసులు దాచిపెట్టడం మంచిది కాదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఒక వేళ అలా చేస్తే.. ఆ మహమ్మారి దావానలంలా వ్యాపిస్తుందని హెచ్చరించారు. దీనికి నెల్లూరు, కర్నూలు వైద్యుల ఉదంతాలే ఉదాహరణ అని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రోగుల సేవలో ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరమన్నారు. ప్రాణాలు పోసే వైద్యుల ప్రాణాలనే కరోనా తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

‘‘రక్షణ ఉపకరణాలు లేకే వైద్యులు బలవుతున్నారు. తక్షణమే వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు ఇవ్వాలి. ప్రభుత్వాలకు ముందు చూపు ఉండాలి. అభివృద్ధి కొనసాగిస్తే జాతికి ప్రయోజనం. నాశనం చేస్తే జాతి క్షమించదు. అన్ని పార్టీలతో ప్రధాని చర్చలు జరిపారు. మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులను సంప్రదించారు. వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ఎడిటర్లతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో మోదీ ఏకాభిప్రాయం తెచ్చారు. మనదేశంలో లాక్‌డౌన్‌-1 సత్ఫలితాలు ఇచ్చింది. అందుకే ధైర్యంగా లాక్‌డౌన్‌-2 ప్రకటించారు. మన రాష్ట్రంలో వైకాపా నేతలు ఇష్టానుసారం చేస్తున్నారు. ఒక పద్ధతిలేకుండా చేస్తున్నారు. కరోనా పరీక్షలపై అబద్ధాలు చెబుతున్నారు. అందువల్లే మన రాష్ట్రంలో కరోనా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 నగదు సాయం అందరికీ అందలేదు. రేషన్‌ దుకాణాల్లో పంచదార ఇచ్చి రూ.10 వసూలు చేస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో పేదలకు అండగా నిలిచి నిత్యావసరాల పంపిణీ కొనసాగించాలి’’ అని చంద్రబాబు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని