వలస కార్మికుల గురించి ఆలోచించాలి: రాహుల్‌

తాజా వార్తలు

Published : 24/04/2020 00:13 IST

వలస కార్మికుల గురించి ఆలోచించాలి: రాహుల్‌

దిల్లీ: కరోనా వేళ కష్టాలు ఎదుర్కొంటున్న వలస కార్మికుల సమస్యను ప్రభుత్వం తొలి ప్రాధాన్య అంశంగా చూడాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. మే 3 తర్వాత లాక్‌డౌన్‌ను కేవలం హాట్‌స్పాట్‌ కేంద్రాలకే పరిమితం చేయాలని సూచించారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడారు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ తాత్కాలిక ఉపసంహరణ చర్యగా (పాజ్‌ బటన్‌ లాంటిది) అని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల గురించి ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మే 3 తర్వాత హాట్‌స్పాట్‌ కేంద్రాల్లో మాత్రమే లాక్‌డౌన్‌ను పొడిగించాలన్నారు. గ్రీన్‌జోన్లలో కార్యకలాపాలను పునరుద్ధరించాలని రాహుల్‌ కోరారు.

స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించండి: ప్రియాంక
లాక్‌డౌన్‌ కారణంగా ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు వారివారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అంతకంటే ముందు కార్మికులకు తగిన పరీక్షలు నిర్వహించి, జాగ్రత్తలు చెప్పాలన్నారు. కరోనాపై పోరాటంలో శత్రుత్వం కాదు.. దయ, జాలి కీలకపాత్ర పోషిస్తాయని ప్రియాంక అన్నారు.

ఇవీ చదవండి..

తప్పు చేయొద్దు..సుదీర్ఘకాలం మనతోనే కరోనా!

కరోనా వైరస్‌ను మొదట కనిపెట్టింది ఆమేనట!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని