Gujarat elections: ఆప్, భాజపాల మధ్యే పోటీ..!

తాజా వార్తలు

Published : 28/06/2021 01:13 IST

Gujarat elections: ఆప్, భాజపాల మధ్యే పోటీ..!

సూరత్‌: వచ్చే ఏడాది జరగబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), భారతీయ జనతా పార్టీ (భాజపా) మధ్యే పోటీ ఉంటుందని దిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియా వెల్లడించారు. వ్యాపారవేత్త మహేశ్ సవానీ ఆప్‌లో చేరిన సందర్భంగా ఆదివారం ఆయన సూరత్‌లో మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న భాజపాతో రాష్ట్రంలో ఎలాంటి మార్పూ రాలేదన్నారు. ఆప్‌ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని పేర్కొన్నారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ సుపరిపాలకు మరో పేరుగా తమ పార్టీ నిలిచిందన్నారు. ప్రజల్లో తమ పార్టీపై విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. సవానీ లాంటివారు తమ పార్టీలో చేరడం..  సామాన్య పౌరులు సహా వ్యాపార వర్గాలు సైతం గుజరాత్‌లో మార్పు కోరుకుంటున్నారనడానికి సంకేతం అని ఆయన వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని