Punjab Politics: ఒక సామాన్యుడిని సీఎం చేశారు.. ఆయనో రివల్యూషనరీ లీడర్‌!

తాజా వార్తలు

Published : 21/09/2021 01:26 IST

Punjab Politics: ఒక సామాన్యుడిని సీఎం చేశారు.. ఆయనో రివల్యూషనరీ లీడర్‌!

సీఎంగా తొలి ప్రెస్‌మీట్‌లో చన్నీ కీలక వ్యాఖ్యలు

చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని పంజాబ్‌ నూతన సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ విజ్ఞప్తి చేశారు. ఆ ‘నల్ల’ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతు ఉద్యమానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టంచేశారు. పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక సామాన్యుడినైన తనను ముఖ్యమంత్రిని చేసి పార్టీ అదిష్ఠానం ఉన్నత గౌరవం కల్పించిందన్నారు. రాహుల్‌ గాంధీని ఓ రివల్యూషనరీ లీడర్‌గా అభివర్ణించారు. పంజాబ్‌ చరిత్రలో తొలి దళిత సీఎంగా ఎన్నికైన చరణ్‌జిత్‌.. సామాన్యుల గొంతుకగా ఉంటానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అందరం కలిసి సమష్టిగా పనిచేసి పంజాబ్‌ను మరింత సంపన్నంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పంజాబ్‌ ప్రధానంగా వ్యవసాయక రాష్ట్రమన్న ఆయన.. తమ ప్రభుత్వం రైతు అనుకూల ప్రభుత్వమన్నారు. ఈ ప్రభుత్వం పంజాబ్‌ ప్రజలదని.. అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్‌ సిద్ధాంతమని పేర్కొన్నారు. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా బాగా పనిచేశారని కొనియాడారు. నీటి హక్కులను సంరక్షించారన్నారు. ముఖ్యమంత్రి.. కేబినెట్‌.. కన్నా పార్టీయే సుప్రీం అన్నారు. పార్టీ అదిష్ఠానం ఇచ్చిన 18 పాయింట్ల కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని.. హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. పంజాబ్‌ ప్రజలకు పారదర్శకమైన పాలనను అందిస్తామని భరోసా ఇచ్చారు. పేదల నీటి బిల్లులను మాఫీ చేస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని