AP News: విద్యార్థుల్ని బలిచేయొద్దు: లోకేశ్‌

తాజా వార్తలు

Updated : 02/06/2021 12:58 IST

AP News: విద్యార్థుల్ని బలిచేయొద్దు: లోకేశ్‌

టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్‌

అమరావతి: అక్రమ సంపాదనపై ధ్యాస తప్ప విద్యార్థుల బాగోగులు పట్టించుకునే సమయం సీఎం జగన్‌కు లేకపోవడం దురదృష్టకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల రద్దును డిమాండ్‌ చేస్తూ పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆయన వర్చువల్‌గా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయకుండా వాయిదా వేయడం దుర్మార్గమన్నారు. 

ఆగస్ట్‌, సెప్టెంబర్‌లో కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని.. అది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని లోకేశ్ గుర్తుచేశారు. విద్యార్థుల్ని బలిచేయవద్దని సీఎంను కోరారు. పరీక్షల వాయిదాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడటం ఆపి ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులను పాస్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని