Dalit Bandhu: ప్రగతిభవన్‌లో కూర్చోవడం కాదు.. నిధులు కేటాయించాలి

తాజా వార్తలు

Published : 27/07/2021 14:58 IST

Dalit Bandhu: ప్రగతిభవన్‌లో కూర్చోవడం కాదు.. నిధులు కేటాయించాలి

దళిత బంధు పథకం అమలు తీరుపై కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌: దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని, అందుకు అవసరమైన నిధుల కేటాయింపునకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆమోదించాలని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు సంబాని చంద్రశేఖర్‌లు డిమాండ్‌ చేశారు. దళితుల సంక్షేమం కోసం ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తుందని వారు స్పష్టం చేశారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున కేటాయించాలంటే ఇప్పుడు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు సరిపోవన్నారు. ప్రగతి భవన్‌లో కూర్చుంటే సరిపోదని.. వెంటనే నిధుల కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికల వేళ దళిత కుటుంబాలకు 3 ఎకరాలు చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారని.. అయితే అమల్లోకి రాలేదని నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ పాలనలో పేదలకు ఇచ్చిన భూములను కేసీఆర్ దళితుల నుంచి లాక్కొని పరిశ్రమలకు ఇస్తున్నారని విమర్శించారు. ఒక్క ఫార్మా సిటీ కోసం ఒక్క గ్రామంలోనే 1,026 ఎకరాల దళితుల భూమి గుంజుకున్నారని ధ్వజమెత్తారు. కొకాపేట, కూకట్‌పల్లి పరిధిలోని భూములను ఎకరాకు రూ.8 లక్షలకు చొప్పున కొనుగోలు చేసి రూ. కోట్లకు పరిశ్రమలకు అమ్ముకుంటూ దళితులను మోసం చేశారని ఆరోపించారు. ఈ విషయాలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని