Election Commission Of india: ఉపఎన్నికలకు మార్గదర్శకాలు జారీ చేసిన ఈసీ

తాజా వార్తలు

Published : 22/10/2021 01:35 IST

Election Commission Of india: ఉపఎన్నికలకు మార్గదర్శకాలు జారీ చేసిన ఈసీ

హైదరాబాద్‌: ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గం పొరుగున ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో ఉపఎన్నికతో నేరుగా సంబంధం ఉన్న ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గాల సమీపంలో ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అక్కడ ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.

‘‘ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గం ఉన్న జిల్లాలోనూ ఎన్నికల కార్యకలాపాల విషయంలో ఎంసీసీ, కొవిడ్ నిబంధనలు వర్తిస్తాయి. కేవలం అభివృద్ధి, పాలనాపరమైన కార్యకలాపాలకు ఆటంకం కలగరాదన్న ఉద్దేశంతోనే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జిల్లా మొత్తం కాకుండా నియోజవర్గానికి మాత్రమే పరిమితం చేస్తూ గతంలో ఆదేశాలు జారీ చేశాం. అయితే అదే జిల్లాలో నియోజకవర్గం వెలుపల రాజకీయ కార్యకలాపాలు కొనసాగడం ఈ స్ఫూర్తికి విరుద్ధం. ఖర్చుకు సంబంధించి పర్యవేక్షణ కూడా అమల్లో ఉంటుంది. ఈ మేరకు జిల్లాల ఎన్నికల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఈసీ ఆదేశాల్లో పేర్కొంది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని