తెలంగాణలో త్వరలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు?

తాజా వార్తలు

Published : 28/07/2021 16:36 IST

తెలంగాణలో త్వరలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు?

హైదరాబాద్‌: తెలంగాణలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్‌ 3వ తేదీతో ముగిసింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌, ఆకుల లలిత.. పదవీకాలం పూర్తయిన వారిలో ఉన్నారు.

సాధారణంగా గడువు ముగిసే సమయానికంటే ముందే ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తుంది. అయితే, కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత నేపథ్యంలో అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికలు నిర్వహించడం లేదని స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం... ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని ప్రకటించింది. దీంతో జూన్‌ 3 నుంచి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గి అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ విషయమై ఈసీ ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందినట్టు సమాచారం. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని కోరినట్టు తెలిసింది. ఈసీ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాక ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని