AP NEWS: విశాఖ ఉక్కు విక్రయం ఆపండి: విజయసాయిరెడ్డి

తాజా వార్తలు

Published : 23/07/2021 19:09 IST

AP NEWS: విశాఖ ఉక్కు విక్రయం ఆపండి: విజయసాయిరెడ్డి

దిల్లీ: విశాఖ ఉక్కుపై కార్మిక సంఘాల నేతలతో కలిసి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విక్రయం ఆపాలని, పరిశ్రమపై నిర్ణయం ఉపసంహరించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ‘‘విశాఖ ఉక్కు’ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉంది. నవరత్న హోదా  సాధించిన విశాఖ ఉక్కు ఏపీకి ఆభరణం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై లక్షకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఉక్కు పరిశ్రమ వల్లే మహానగరంగా విశాఖ విస్తరించింది’’ అని విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని