close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జగన్‌... ప్రజల మాట వినండి

సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్‌కు తమ పార్టీ మొదటినుంచీ మద్దతిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా తెలిపారు. ‘‘రాజధానిని గుంటూరు, విజయవాడ మధ్య పెట్టాలన్నది ఏ ఒక్కరి నిర్ణయమో కాదు. రాష్ట్ర శాసనసభే తీర్మానించింది. రైతుల నుంచి 30వేల ఎకరాలకుపైగా సమీకరించారు. ఇప్పటికే చాలా సంస్థలు వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్‌ దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియడంలేదు’అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 90% మంది అమరావతే రాజధానిగా ఉండాలని కోరుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.

కొత్త వివాదం -మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
పరిపాలన, శాసనసభ, న్యాయ రాజధానిని వేర్వేరు చోట్ల ఏర్పాటు చేస్తామని ప్రజల మధ్య కొత్త వివాదాన్ని లేవనెత్తారు.

రైతు కంటక పాలన  -అశ్వినీదత్‌, సినీ నిర్మాత
రాజకీయ పార్టీల మధ్య ఎన్ని విభేదాలున్నా వాటి దుష్పభావం ప్రజా జీవనం మీద పడొద్దని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చెప్పేవారు. ఆయన ఆశయాలను నెరవేరుస్తానని అధికారంలోకొచ్చిన జగన్‌.. రైతు కంటక పాలన సాగించడం దురదృష్టకరం.

ఇదో తుగ్లక్‌ చర్య -దేవవ్రత బిశ్వాస్‌, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ సీనియర్‌ నేత
దేశంలో ఎక్కడ ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టాలన్నా భూమి లభ్యతే ప్రధాన అవరోధంగా ఉన్న తరుణంలో, దానికి భిన్నంగా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారు.  ఎలాంటి కారణం లేకుండా రాజధానిని మార్చాలనుకోవడం తుగ్లక్‌ చర్య.

ధృతరాష్ట్ర పాలన -శివారెడ్డి, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు
రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన కొనసాగుతోంది. కూల్చివేతలతో మొదలైన ఈ ప్రభుత్వం కచ్చితంగా పతనమవుతుంది.

ఎన్నికలకు ముందే ఎందుకు ప్రకటించలేదు?: -సాయిరెడ్డి, భారతీయ కిసాన్‌ సంఘ్‌ కార్యదర్శి
రైతుల భూములు తీసుకుని అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 60 నుంచి 70% కట్టడాలూ పూర్తయ్యాయి. ఇప్పుడు అక్కడున్న ఒక్క ఎకరమూ వ్యవసాయ యోగ్యంగా లేదు. ప్రభుత్వం మారినా నిర్ణయాలు మారకూడదు. ఎన్నికలకు ముందే మూడు రాజధానులని ఎందుకు ప్రకటించలేదు?

కార్యనిర్వాహక రాజధాని చేయాలి -రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ
మూడు రాజధానులు మా పార్టీ నిర్ణయం కాదు. ప్రభుత్వ నిర్ణయం. అది మా పార్టీ ఎజెండాలో లేదు. రాజధానిని మార్చబోమని మా సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు.అమరావతికి మద్దతిస్తున్నట్టు జగన్‌ అసెంబ్లీలోనూ చెప్పారు. మా ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ పేరిట 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పటికీ... నేను అమరావతికే మద్దతిస్తున్నా. ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది కాబట్టి, అది తప్పనిసరనుకుంటే...విశాఖకు బదులు అమరావతినే కార్యనిర్వాహక రాజధాని చేయాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.