మిల్లర్ల దయాదాక్షిణ్యాలకు రైతులను వదిలేయొద్దు: తెజస
close

ప్రధానాంశాలు

మిల్లర్ల దయాదాక్షిణ్యాలకు రైతులను వదిలేయొద్దు: తెజస

ఈనాడు, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. రైతులను మిల్లర్ల దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా ప్రభుత్వమే చొరవ తీసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు పార్టీ నేతలు శ్రీశైల్‌రెడ్డి, శ్రీధర్‌ తదితరులతో కలిసి సోమవారం ఆయన వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.రఘునందనరావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌కు వేర్వేరుగా వినతిపత్రాలను అందజేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎప్పుడు కొంటారో తెలియక కనీసం 10-60 రోజుల వరకూ అమ్మకం కోసం కర్షకులు వేచిచూడాల్సి వస్తోందన్నారు. క్వింటా ధాన్యానికి సుమారు 2-3 కిలోల తరుగు రూపంలో తీసుకుంటున్నారని, ఫలితంగా రైతులు దోపిడికి గురవుతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని రైతులకు రాజ్యాంగపరమైన హామీలను అమలు పర్చాలని కోదండరాం కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని