ఆస్ట్రేలియా ఘన విజయం 
close

తాజా వార్తలు

Updated : 19/12/2020 14:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్ట్రేలియా ఘన విజయం 

టీమ్‌ఇండియాపై సంపూర్ణ ఆధిపత్యం
చెలరేగిన హాజిల్‌వుడ్‌, కమిన్స్‌
రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన భారత్‌..

 

ఇంటర్నెట్‌డెస్క్‌: అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండున్నర రోజుల్లోనే పూర్తయింది. టీమ్‌ఇండియా ఘోర పరాభవం చవిచూసింది. కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్‌లో 36/9 అత్యల్ప స్కోరు నమోదు చేయడంతో ఆసీస్‌ సునాయాస విజయం సాధించింది. రెండు వికెట్లు నష్టపోయి 53 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లోటును భర్తీ చేస్తూ 90 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు మాథ్యూవేడ్‌(33; 53 బంతుల్లో 5x4), జో బర్న్స్‌(51నాటౌట్‌; 63 బంతుల్లో 7x4, 1x6) నిలకడగా ఆడి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే వేడ్‌ రనౌటయ్యాక, మార్నస్‌ లబుషేన్‌(6) కూడా విఫలమయ్యాడు. చివరికి స్మిత్‌(1)తో కలిసి బర్న్స్‌ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో టెస్టు డిసెంబర్‌ 26న మెల్‌బోర్న్‌లో జరగనుంది. 

గంటన్నరకే టీమ్‌ఇండియా ఢమాల్‌
అంతకుముందు మూడో రోజు ఆట మొదలైన గంటన్నరకే టీమ్‌ఇండియా కుప్పకూలింది. 36/9 స్కోర్‌ సాధించి భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు నమోదు చేయకపోవడం గమనార్హం. 9/1తో శనివారం ఆట ప్రారంభించిన టీమ్‌ఇండియాను రెండో ఓవర్‌లోనే కమిన్స్‌ 4/21 దెబ్బ తీశాడు. నైట్‌వాచ్‌మన్‌ జస్ప్రీత్‌ బుమ్రా(2)ను ఔట్‌ చేసిన అతడు భారత వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. మరో ఎండ్‌ నుంచి హాజిల్‌వుడ్‌ 5/8 చెలరేగడంతో భారత బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లే వెనుతిరిగారు. పుజారా(0), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(4), అజింక్య రహానె(0), హనుమ విహారి(8), వృద్ధిమాన్‌ సాహా(4), అశ్విన్‌(0), ఉమేశ్‌ యాదవ్‌(4), షమి(1) ఇలా వచ్చి అలా వెళ్లారు. చివరికి షమి రిటైర్ట్‌ హర్ట్‌గా వెనుతిరగడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో టీమ్‌ఇండియా టెస్టు క్రికెట్‌లో అత్యల్ప స్కోరు 36/9 నమోదు చేసింది. 1974లో భారత్‌.. ఇంగ్లాండ్‌పై లార్డ్స్‌ మైదానంలో 42 పరుగులకే ఆలౌటై అత్యల్ప స్కోరు చేసింది. 

స్కోరు బోర్డు వివరాలు..

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 244 ఆలౌట్‌ ; కోహ్లీ 74, పుజారా 43 పరుగులు; స్టార్క్‌ 4 వికెట్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 191 ఆలౌట్‌ ; టిమ్‌పైన్‌ 73, లబుషేన్‌ 47 పరుగులు; అశ్విన్‌ 4 వికెట్లు
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 36/9 ; మయాంక్‌ 9, విహారి 8 పరుగులు; హాజిల్‌వుడ్‌ 5 వికెట్లు
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 93/2; జో బర్న్స్‌ 51*, మాథ్యూవేడ్‌ 33; అశ్విన్‌ 1 వికెట్‌

ఇవీ చదవండి..

బుమ్రా అలా గొప్పలు చెప్పుకుంటాడు

విరుష్క.. ఆసీస్‌లో బిడ్డను కనండి!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని