ఉత్కంఠ నడుమ ఆకాశంలో అద్భుతం!

తాజా వార్తలు

Published : 21/12/2020 01:27 IST

ఉత్కంఠ నడుమ ఆకాశంలో అద్భుతం!

ఇంటర్నెట్‌డెస్క్‌: అభిమానులంతా ఆసక్తికరంగా మ్యాచ్‌ వీక్షిస్తున్న సమయంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. అయితే అది మైదానంలో కాదు, ఆకాశంలో! గురుడు, శని గ్రహాలు దగ్గరగా చేరి ప్రకాశవంతంగా కనిపించాయి. ఈ రమణీయమైన దృశ్యం సెడెన్ పార్క్‌ వేదికగా జరిగిన న్యూజిలాడ్‌×పాకిస్థాన్ రెండో టీ20లో చోటు చేసుకుంది. ఛేదనకు దిగిన కివీస్‌ 10వ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా కెమెరామన్‌ దీన్ని బంధించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

భూమి నుంచి చూస్తే ఏవైనా రెండు గ్రహాలు అతి దగ్గరగా చేరినట్లు కనిపించే దృశ్యాన్ని కంజక్షన్‌గా పిలుస్తారు. ఇలా గురు-శని గ్రహాలు కనిపించడాన్ని మాత్రం ‘గ్రేట్‌ కంజక్షన్‌’ అంటారు. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు నిత్యం కొంత దగ్గరగా వస్తున్నాయి. సోమవారం అతి దగ్గరగా చేరి అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాయి. దాదాపు నాలుగు శతబ్దాల తర్వాత ఈ అద్భుతం చోటు చేసుకోనుంది. అంతకుముందు 1623లో ఇలా జరిగింది. మరోవైపు సెడెన్‌ పార్క్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్‌ ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. అనంతరం కివీస్ 19.2 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదీ చదవండి

కోహ్లీసేనను రక్షించాలంటే ద్రవిడ్ వెళ్లాల్సిందే!

పృథ్వీ షా వద్దు..రాహుల్‌ రావాల్సిందేAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని