CSK: ఆ 13 మంది  క్వారంటైన్‌లోనే..

తాజా వార్తలు

Published : 02/09/2020 01:51 IST

CSK: ఆ 13 మంది  క్వారంటైన్‌లోనే..

మిగిలిన వారికే నెగెటివ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఊరట! గతవారం కరోనా బారిన పడిన ఆటగాళ్లు మినహా మిగతావారు సాధన చేసేందుకు అనుమతి లభించింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వీరికి నెగెటివ్‌ వచ్చింది. ఆ 13 మందికి మాత్రం 14 రోజుల క్వారంటైన్‌ తర్వాతే పరీక్షలు చేస్తారు. కాగా కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన 13 మంది సహా అందరికీ నెగెటివ్ వచ్చినట్టు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అవి అవాస్తవమని తాజాగా తెలిసింది. ధోనీసేన త్వరలోనే ప్రాక్టీస్‌ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. పది రోజుల క్రితమే అన్ని జట్లూ దుబాయ్‌, అబుదాబికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చెన్నై కూడా ఆగస్టు 21న దుబాయ్‌కి చేరుకుంది. 

తొలుత అక్కడ ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉన్న ఆ జట్టుకు పలుమార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పేసర్‌ దీపక్‌ చాహర్‌, బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌తో పాటు 11 మంది సహాయక సిబ్బందికి వైరస్‌ సోకినట్టు నిర్ధరణ అయింది.  దీంతో ఆ జట్టు ఆటగాళ్లంతా మరో వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సోమవారం 13 మందికి మినహా నిర్వహించిన తొలి పరీక్షలో అందరికీ నెగిటివ్‌గా వచ్చిందని సీఎస్కే మేనేజర్‌ కాశీ విశ్వనాథన్‌ వెల్లడించారు. సెప్టెంబర్‌ 3న మరోసారి నిర్ధరణ పరీక్షలు చేస్తారని, అందులో కూడా అందరికీ నెగిటివ్‌గా వస్తే తమ జట్టు సెప్టెంబర్‌ 5 నుంచే ప్రాక్టీస్‌ మొదలు పెడుతుందని ఆయన అన్నట్లు తెలిసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని