close

తాజా వార్తలు

‘4’లో రానందుకు బాధలేదు: శ్రేయస్‌

రాజ్‌కోట్‌: ప్రస్తుతం నెలకొన్న పోటీతో జట్టులో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలని టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. ఎప్పుడూ ఆడే నాలుగో స్థానంలో ముంబయి వన్డేలో రానందుకు బాధపడటం లేదన్నాడు. కేఎల్‌ రాహుల్‌ కోసం తనకు అలవాటైన మూడో స్థానంలో కాకుండా కోహ్లీ నాలుగో స్థానంలో వచ్చాడు. దీంతో శ్రేయస్‌ తన ఆర్డర్‌ను మరింత వెనక్కి జరపాల్సి వచ్చింది.

‘కచ్చితంగా ఏదో ఒక స్థానంలో మాత్రమే బ్యాటింగ్‌ చేస్తానని చెప్పేందుకు కారణాలు చెప్పొద్దు. ప్రతిసారీ ఒకే స్థానంలో రావడం కుదర్లేదని బాధపడొద్దు. మేం ప్రయోగాలపై దృష్టి సారించాల్సి ఉంది. అందరూ ఏదో ఒక స్థానంలో కుదురుకుంటారని భావిస్తున్నా. ఇప్పుడు మేం ప్రయోగాలు చేయాలి. అలాగైతేనే భవిష్యత్తులో అవి పని చేస్తాయి. కొన్నిసార్లు జట్టు కుప్పకూలుతుంది. అభిమానులు అందుకు సిద్ధంగా ఉండరు. కానీ ఆటలో ఇవన్నీ సహజమే’ అని శ్రేయస్‌ అన్నాడు.

‘అడ్డంకులు దాటుకుంటూ ముందుకెళ్లాలి. ఒక జట్టుగా సీజనంతా మేం బాగా ఆడుతున్నాం. ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుంది. దీని నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. నెట్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో సాధన చేస్తున్నా. అతడి బౌలింగ్‌లో ఎలాంటి మార్పు లేదు. మంచి వేగం ఉంది. అతడి గురించి ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటున్నా. వెస్టిండీస్‌పై మేం 0-1 నుంచే పుంజుకున్నాం. ఇప్పుడూ మేం అలా చేయగలం. డ్రెస్సింగ్‌ రూమ్‌లో దాని గురించే చర్చించుకున్నాం. మమ్మల్ని మేం విశ్వసించి ఆత్మవిశ్వాసంతో నిలబడాలి. అప్పుడే విజయాలు సాధ్యమవుతాయి. ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్‌వెల్‌ జట్టులో ఉన్నా లేకున్నా అతడి వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు. అందుకే అతడి వైఖరి నాకెంతో ఇష్టం’ అని శ్రేయస్‌ పేర్కొన్నాడు.

ఇవీ చదవండి..

ఎంఎస్‌ ధోనీకి కాంట్రాక్టు నిరాకరించిన బీసీసీఐ

కాంట్రాక్టు నిరాకరణ దాదా దర్శకత్వంలో ధోనీ సినిమాకు క్లైమాక్సా?

కోహ్లీని ఆశీర్వదించిన బామ్మ కన్నుమూత


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.