IPL 2021:ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం: రిషభ్‌ పంత్‌

తాజా వార్తలు

Published : 19/09/2021 01:28 IST

IPL 2021:ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం: రిషభ్‌ పంత్‌

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌ నుంచి యూఏఈకి చేరుకున్న దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ రిషభ్‌ పంత్.. ఆరు రోజుల క్వారంటైన్‌ ముగియడంతో శనివారం జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సీజన్‌లో మొదటి దశలో చేసిన అద్భుతమైన ప్రదర్శనను రెండో దశలోనూ కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

‘క్వారంటైన్‌ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అందరిని కలవడం సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. క్వారంటైన్‌లో ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువ సమయం బాల్కనీలో కూర్చున్నా. రెండు మూడు రోజుల్లో పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడతాను. ఐపీఎల్ ట్రోఫీ గెలవడం మా అంతిమ లక్ష్యం. మేము రూపొందించుకున్న ప్రణాళికపై దృష్టిపెట్టబోతున్నాం. మొదటి దశలో చేసిన అద్భుత ప్రదర్శనను రెండో దశలోనూ కొనసాగిస్తామని ఆశిస్తున్నాం. ఈ సారి మేం ట్రోఫీ గెలిచే అవకాశం ఉంది’ అని పంత్‌ అన్నాడు.

బయోబుడగలో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడంతో మే మొదటివారంలో ఐపీఎల్ అర్ధంతరంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ వాయిదాపడేనాటికి ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన దిల్లీ క్యాపిటల్స్‌.. ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్‌ రెండో దశలో సెప్టెంబరు 22న సన్ రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని